జగన్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తుంది.. నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్..!

Tuesday, June 30th, 2020, 11:36:26 PM IST


ఏపీలోని వైజాగ్‌లో ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే మరో గ్యాస్ లీకేజ్ సంభవించింది. పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ కెమికల్స్ నుండి గ్యాస్ లీకేజీ కారణంగా ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ఘటనపై స్పందించిన నారా లోకేశ్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.

నిత్యం కంపెనీల్లో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు హరిస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్రపోతుందని అన్నారు. ప్రతిపక్ష నాయకులు బాధితుల పక్షాన నిలబడటానికి వీల్లేదన్నట్టు వ్యవహరించడం బాధాకరమని, జగన్ ప్రభుత్వం నిరంకుసత్వంగా వ్యవహరిస్తుంది. గ్యాస్ లీకేజ్‌కి కారణమైన సాయినార్ కంపెనీ దగ్గరకు వెళ్లేందుకు ప్రతిపక్షాలకు అనుమతి ఉండదా అని ప్రశ్నించారు. బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని అడిగినందుకు టీడీపీ సీనియర్ నేత బండారి సత్యనారాయణ మూర్తి గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపాడు.