నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా నేడు నారా లోకేశ్ బాపట్ల నియోజకవర్గంలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను కలుసుకున్న లోకేశ్ కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న పంటను చూసుకుని రైతులు అనుభవిస్తోన్న క్షోభ మాటలకు అందనిదని, ఇలాంటి స్థితిలో మీకు అండగా మేమున్నామనే భరోసా ఇవ్వలేకపోతే ఇంక ప్రభుత్వం ఉండి ఏం లాభమని ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా, పొన్నూరు నియో0జకవర్గం పచ్చల తాడిపర్రు గ్రామంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి, అక్కడి రైతులను కూడా లోకేశ్ పరామర్శించాను. వరుస తుఫాన్లు, వరదల కారణంగా పూర్తిగా నష్టపోయామని గతంలో వచ్చిన నష్టానికి కూడా ఇప్పటి వరకూ పరిహారం అందలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ-క్రాప్ లో ఎంటర్ కాలేదు కాబట్టి మీకు ప్రభుత్వ సహాయం రాదు అనడం దారుణమని పంట నష్టపోయిన ప్రతీ రైతుకి పరిహారం అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఈరోజు నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం పచ్చల తాడిపర్రు గ్రామంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించాను. వరుస తుఫాన్లు, వరదలు కారణంగా పూర్తిగా నష్టపోయామని..,(1/2) pic.twitter.com/0nwhO53xOT
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 5, 2020