టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ సర్కార్‌పై మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైఎస్ జగన్ మైనింగ్ మాఫియా విచ్చల విడిగా చెలరేగిపోతోందని, కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి సమీపంలో అక్రమ బ్లాస్టింగ్ వలన బసవయ్య మండపం దెబ్బతిందని ఆరోపించారు. గుడికి సమీపంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదులు అందినా ప్రభుత్వం గుడ్డిగా ఉండటం వలనే దేవాలయం దెబ్బతిందని అన్నారు.
అయితే గుడికి సమీపంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వైకాపా కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని, దేవాలయం సమీపంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలని, దెబ్బతిన్న మండపానికి వెంటనే మరమ్మతులు చెయ్యాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
.@ysjagan మైనింగ్ మాఫియా విచ్చల విడిగా చెలరేగిపోతోంది. కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి సమీపంలో అక్రమ బ్లాస్టింగ్ వలన బసవయ్య మండపం దెబ్బతింది.గుడికి సమీపంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదులు అందినా ప్రభుత్వం గుడ్డిగా ఉండటం వలనే దేవాలయం దెబ్బతింది.(1/2) pic.twitter.com/NwnrOkSGYv
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 27, 2021