ఏపీ సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీ పెద్దల పాద పూజ రాష్ట్రం కోసం కాదు కేసుల మాఫీ కోసం అని తేలిపోయిందని, జాతీయ మీడియాలో వస్తున్న కధనాలు చూస్తుంటే త్వరలోనే జగన్, ఆయన డెకాయిట్ బ్యాచ్ కి మరో సారి చిప్పకూడు ఖాయం అని స్పష్టమవుతోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఈ సారి ఏకంగా విదేశీయులు జగన్ రెడ్డి గ్యాంగ్ ఆర్థిక నేరాలపై ఫిర్యాదు చేసారని, ఇక ఈ సారి వెళ్ళేది చంచల్ గూడా జైలు కాదని విదేశీ జైలే అని లోకేశ్ అన్నారు.
ఢిల్లీ పెద్దల పాద పూజ రాష్ట్రం కోసం కాదు కేసుల మాఫీ కోసం అని తేలిపోయింది. జాతీయ మీడియా లో వస్తున్న కధనాలు చూస్తుంటే త్వరలోనే @ysjagan, ఆయన డెకాయిట్ బ్యాచ్ కి మరో సారి చిప్పకూడు ఖాయం అని స్పష్టమవుతోంది.(1/2) pic.twitter.com/dGKTkCiRDN
— Lokesh Nara (@naralokesh) March 5, 2021