మీరు, మీ శకుని మామ కలిసే కుట్ర పన్నారు.. జగన్‌పై నారా లోకేశ్ ఫైర్..!

Tuesday, September 17th, 2019, 08:00:40 PM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న చనిపోయారు. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం వరుస కేసులతో కోడెలను బాగా టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే ఈ కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల నిన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది.

అయితే గత కొద్ది రోజులుగా భూ వివాదంలో వసూళ్ళకు పాలప్డ్డారని కోడెల కొడుకు, కూతుర్లపై కేసులు పెట్టడం, కోడెల నివాసంలో అసెంబ్లీ ఫర్నీచర్ ఉన్నాయని, చివరకు అసెంబ్లీ ఫర్నీచర్ కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని ఆయనపై కేసులు పెట్టి అవమానానికి గురిచేసారు. అయితే కోడెల ఆత్మహత్యపై స్పందించిన టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కోడెల మరణం ముమ్మాటికి వైసీపీ రాజకీయ హత్యే అని, కోడెల మరణానికి పూర్తి బాధ్యత వైసీపీదేనన్ని అంటున్నారు. అయితే అసెంబ్లీ ఫర్నీచర్‌పై వైసీపీ చేసిన ఆరోపణలపై నారా లోకేశ్ స్పందిస్తూ ఐపీసీ 420 కింద కేసులున్న ప్రబుద్ధులు అలాంటి పనులే చేస్తారని పెద్దలంటుంటారు. జగన్ గారు! కోడెలగారి విషయంలో కూడా మీరు అదే చేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా కోడెలగారు హుందాగా వ్యవహరించి మీ స్పీకర్ గారికి లేఖకూడా రాశారు. ఆయన కూడా అందిందని సంతకం చేశారు. అలాంటప్పుడు కేసులెలా పెడతారని ప్రశ్నించారు. ఇదంతా మీరు, మీ శకునిమామ విజయసాయి రెడ్డి కలిసి కోడెల గారిని మానసికంగా దెబ్బతీసేందుకు, సమాజంలో వారికున్న మంచిపేరును చెడగొట్టేందుకు పన్నిన కుట్ర కాదా? మీరు దొంగలు అయినంత మాత్రాన అందరూ అలాంటివారి అనుకుంటే అంతకంటే నీచమైన ఆలోచన ఇంకొకటి ఉండదని అన్నారు.