ప్రజలకు ఇచ్చిన మాట గుర్తుందా.. జగన్‌పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..!

Thursday, July 11th, 2019, 03:40:12 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయినా కూడా వైసీపీ, టీడీపీ మద్గ్య రోజూ మాటల యుద్ధం పెరిగిపోతూ ఉంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ యువనేత నారాలోకేశ్ వైసీపీ, జగన్‌లపై తన ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా నారాలోకేశ్ జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తుఫాను అనగానే అట్నుంచటే హైదరాబాదుకు చెక్కేసిన మీరు, ఆ తర్వాత తీరిగ్గా వరద ప్రాంతాలకు వెళ్ళి అధికారంలోకి రాగానే తిత్లీ తుఫాను నష్టం రూ.3,435 కోట్లను బాధితులకు నేరుగా ఇస్తానని సిక్కోలు ప్రజలకు చెప్పారు. ఇచ్చిన మాట గుర్తుందా? లేక ఏదైనా గాలికి కొట్టుకుపోయిందా? అని జనం అడుగుతున్నారు జగన్ గారు అంటూ నారా లోకేశ్ ఘాటుగా ప్రశ్నించారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.