అసెంబ్లీ నుంచి జగన్ పారిపోయాడట.. నారా లోకేశ్ సంచలన తీర్పు..!

Friday, July 12th, 2019, 02:01:42 AM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయినా కూడా వైసీపీ, టీడీపీ మద్గ్య రోజూ మాటల యుద్ధం పెరిగిపోతూ ఉంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ యువనేత నారాలోకేశ్ వైసీపీ, జగన్‌లపై తన ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నారాలోకేశ్ జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసాడు. బురద జల్లి, నిరూపించు అనేసరికి సభ నుంచి పారిపోయే ఆకతాయి చేష్టలు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు చేశారంటే ఉడుకుమోతుతనం అనుకోవచ్చు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ కంత్రీ పనులేంటి జగన్ గారూ అంటూ విమర్శించాడు. అంతేకాదు ఈ జన్మలో మీరు హుందాగా ప్రవర్తించలేరా? నిరూపించలేనప్పుడు సవాళ్ళు చేయడం దేనికి? అని ప్రశ్నించారు. వడ్డీలేని రుణాలు ఇవ్వలేదన్న మీ ఆరోపణలు అబద్దం అనడానికి రుజువులు ప్రజల ముందుంచాం. మీ ఛాలెంజ్ ప్రకారం రాజీనామా చేస్తారా? ప్రతిపక్షానికి అడ్డంగా దొరికిపోయి అసెంబ్లీ నుంచి పారిపోయిన మొదటి ముఖ్యమంత్రిగారికి ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నాం. మీ తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ లోకేశ్ డిమాండ్ చేసారు.