బ్రేకింగ్: జగన్ రాజన్న రాజ్యంపై నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్..!

Sunday, June 16th, 2019, 02:55:51 PM IST

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయౌడు నారా లోకేశ్ తన ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రౌడీలుగా మారి టీడీపీ కార్యకర్తలపై ఇలా దాడులు చేయడం సరికాదని దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.

అంతేకాదు గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప ఇలాంటి అరాచకాలకు మార్గం కాకూడదు అని అన్నారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం, పిన్నెల్లి గ్రామంలో తెదేపాకు ఓటు వేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేశారు. నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారు. మా కార్యకర్తలపై అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 100 కు పైగా దాడులు చేశారు. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం అంటూ వైసీపీని ప్రశ్నించారు? ఏది ఏమైనా పోలీసు యంత్రాంగం తక్షణమే ఈ దాడులపై స్పందించి ఇకనైనా ఇలాంటి అరాచకాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నానంటూ చెప్పుకొచ్చారు.