కోడెలపై సాక్షి విషపత్రికా పగబట్టి చంపింది.. నారా లోకేశ్..!

Wednesday, September 18th, 2019, 09:22:56 PM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మొన్న చనిపోయారు. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం వరుస కేసులతో కోడెలను బాగా టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే ఈ కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల మొన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. నేడు కోడెల అంతిమ సంస్కారాలు కూడా పూర్తయ్యాయి.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కోడెలను చిత్ర హిమస చేసి పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసారని టీడీపీ పెద్ద ఎత్తున వైసీపీపై ఆరోపణలు చేస్తుంది. అయితే అధికార దాహంతో, ఆనాడు మహామేత మొదలు పెట్టిన విషపత్రిక ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉందంటూ శవరాజకీయంలో ఆరితేరిన జగన్ గారి ఆలోచనలకు అనుగుణంగా, దొంగలెక్కల ఆ20 విజయసాయి రెడ్డి గారి సారధ్యంలో నిజాలని కప్పేసి, కోడెల గారిమీద గత 3 నెలలుగా వైకాపా నేతలు ఎలా విషం కక్కారో చూడండి అంటూ సాక్షి పత్రిక రాసిన తప్పుడు వార్తలను ఆధరాలతో సహా బయటపెట్టారు నారా లోకేశ్. అంతేకాదు ప్రజానేత కోడెల గారి వ్యక్తిత్వాన్ని తక్కువచేసి, మానసికంగా వేధించి, ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన వీళ్ళు మనుషులా? ఘనమైన నేరచరిత్ర వైకాపా నేతల సొంతం, సొంత తండ్రి శవంతో మొదలైన ఈ పైశాచిక క్రీడ కోడెల గారి మరణందాకా వచ్చింది అంటూ ఇంకెంతమందిని ఇలా బలి తీసుకుంటారో అని ఆవేదన చెందారు.