టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరో సారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ దురాగతాలకు రోజుకో ముస్లిం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దారుణమని ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్య ఘటన గురించి ఇంకా అందరం బాధలో ఉన్నామని, ఈ లోపు తాడికొండకు చెందిన ముస్లిం మౌజాంషేక్ హనీఫ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని అన్నారు.
ముస్లిం శ్మశానవాటికలో వైసీపీ నేతలు మట్టిని తవ్వుకుపోతుంటే మౌజాంషేక్ హనీ ఎందుకు మట్టిని తీసుకుపోతున్నారని ప్రశ్నించారని, ప్రశ్నించడమే తప్పైపోయినట్టు అతడిని పదిమంది ముందు దాడి చేసి, తిడుతూ అవమానిస్తారా అని ప్రశ్నించారు. ఆయన ప్రాణాలు పోయుంటే ఆ కుటుంబానికి జవాబుదారీ ఎవరు అని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులపై చర్య తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
వైసీపీ దురాగతాలకు రోజుకో ముస్లిం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దారుణం. నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్య ఘటన గురించి ఇంకా అందరం బాధలో ఉన్నాం. ఈలోపు తాడికొండకు చెందినముస్లిం మౌజాంషేక్ హనీఫ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.(1/2) pic.twitter.com/vfLSNI8LxI
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 23, 2020