జగన్ పై సెటైర్లు వేసిన నారా లోకేష్ – ఉత్తుత్తి ఇంటర్వ్యూలు బాగానే ఉన్నాయిగా…

Saturday, July 13th, 2019, 11:27:26 PM IST

ఆంధ్రప్రదేశ్లో నూతనంగా అధికారంలోకి వచినటువంటి వైసీపీ పార్టీ మీద మరియు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, టీడీపీ నేత నారాలోకేష్ ఎప్పటికప్పుడు కూడా విరుచుకుపడుతున్న సంగతి మనకు తెలిసిందే. శుక్రవారం నాడు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పై నారా లోకేష్ తనదైన శైలిలో విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసింది. తాజాగా గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలకు సంబంధించి జగన్ మీద ఒకరకమైన విమర్శలు చేస్తున్నారు. “అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు చూసాం. జగన్ గారి కేసుల్లో ఉత్తుత్తి సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాలంటీర్ పోస్టులకు జరుగుతున్న ఉత్తుత్తి ఇంటర్వ్యూలను చూసి యువతను ఇలా మోసం చేస్తున్నారేంటా అని బాధపడుతున్నాం. జగన్ గారూ! ఇందుకేనా మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. పోస్టులను వైసీపీ నేతలు పంచేసుకుని, అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నాక, ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి అమాయక యువతను మోసం చేస్తారా? దీనికి స్వఛ్చంద దోపిడీ వ్యవస్థ అని పేరు పెట్టాల్సింది” అని లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

కాగా రేషన్ సరుకులు మరియు పెన్షన్ లను ప్రతి ఇంటికి చేరవేసేందుకు ప్రతి గ్రామాల్లో వలంటీర్ల నియామకాన్ని చేపడుతున్నామని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే దానికోసం సుమారు 7లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ పోస్టులకు సంబంధించి స్థానిక ఎమ్మెర్వో నేపథ్యంలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఆ ఇంటర్వ్యూలు నామమాత్రంగానే జరుగుతున్నాయని, అందులో కూడా అవినీతి జరుగుతుందని, మరియు కేవలం తమ పార్టీ వారు చెప్పిన వారికే ఆ పదవులు ఇస్తున్నారని లోకేష్ ఆరోపిస్తున్నారు.