సీఎం జగన్‌కి నారా లోకేశ్ లేఖ.. సరికొత్త డిమాండ్..!

Saturday, May 23rd, 2020, 02:08:09 AM IST

ఏపీ సీఎం జగన్‌కి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో పొగాకు రైతులను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తోందని నష్టపోతున్న పొగాకు రైతులను వెంటనే ఆదుకోవాలని జగన్‌కు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో గత ఏడాది పొగాకును కిలో 170 రూపాయలకు అమ్ముకున్న రైతులు ఈ ఏడాది 130 నుంచి 150 రూపాయలకే విక్రయించాల్సి వస్తుందని అన్నారు.

అయితే పోగాకు వేలం సరిగా జరగకా, ఈ-వేలంలో అతి తక్కువ ధర పలకటం వంటి పరిణామాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని సీజన్ లో తమ ఉత్పత్తిని అమ్ముకోలేక రైతులు 40 రోజుల పాటు నిల్వ చేసుకున్నారని అలా చేశాక కూడా చివరకి నాణ్యత తగ్గిందనే సాకు చూపుతుండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. అయితే పొగాకు రైతులతో ఒక ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని, పొగాకు రైతుల సమస్యను చర్చించి కేంద్రంతో చర్చించి వారికి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని లోకేశ్ డిమాండ్ చేశారు.