సీఎం జగన్‌కి లేఖ రాసిన నారా లోకేశ్.. ఏమన్నాడంటే..!

Friday, May 29th, 2020, 08:46:38 PM IST

తెలుగు రాష్ట్రాలకు మిడతల దండు నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో రైతన్నలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే మిడతల దండును నివారించడంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ సీఎ జగన్‌కు టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేశ్ లేఖ రాశారు.

అయితే ఉత్తరాది రాష్ట్రాలపై దాడి చేసిన మిడతల దండు మహారాష్ట్ర మీదుగా తెలుగు రాష్ట్రాలలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని అన్నారు. అయితే అనంతపురంలోని రాయదుర్గంలో మిడతలు ప్రవేశించాయనే వార్తలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయని, కరోనా నివారణను తేలిగ్గా తీసుకోవడంతో చాలా నష్టం జరిగిందని, పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ వ్యాఖ్యలు రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీశాయని అన్నారు. అయితే వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేసి రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని, తగు సాంకేతికతను వినియోగించుకుంటూ మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని, రైతన్నల పంటలను కాపాడాలని లేఖ ద్వారా కోరారు.