జగన్ పై సంచలన వాఖ్యలు చేసిన నారాలోకేష్

Tuesday, September 10th, 2019, 03:00:07 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత మెజారిటీని దక్కించుకొని మరీ ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి వైసీపీ పార్టీ పై నిత్యం ఎదో ఒక విమర్శలు చేస్తూ వైసీపీ లోపాలను బయటపెట్టడానికి చాలా ప్రయత్నిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీ. అయితే తాజాగా టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిత్యం అధికార గర్వంతో కొట్టుకుంటున్నారని, ప్రజల పట్ల, ప్రజల సమస్యలపట్ల తనకెలాంటి బాధ్యత కూడా ఎక్కడా కనిపించడం లేదని టీడీపీ నేత నారాలోకేష్ తీవ్రమైన విమర్శలతో విరుచుకపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు…

కాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ సోమవారంనాడు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రజల మనోభావాలను అసలే పట్టించుకోవడంలేదని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసమని ప్రపంచబ్యాంక్‌ కి కేంద్రం ఎన్నో లేఖలు రాసినప్పటికీ కూడా అవేమి పట్టనట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని లోకేష్ అన్నారు. ఇదంతా కూడా రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఇదంతా కూడా సాక్ష్యం అని లోకేష్ వివరించారు.