టీడీపీకి తొలిదెబ్బ పడింది..తట్టుకోవటం సాధ్యమేనా..?

Thursday, June 13th, 2019, 12:56:58 PM IST

తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కూకటివేళ్లతో సహా బయటకు తీసుకోని వస్తామని చెప్పాడు జగన్. అందుకు తగ్గట్లే ఇప్పుడు మెల్ల మెల్లగా టీడీపీ నాయకుల మీద ఫోకస్ పెడుతున్నాడు. అందులో భాగంగా ఒక్కప్పుడు టీడీపీకి అండదండగా నిలిచి, ఆ తర్వాత ప్రభుత్వంలో మంత్రి పదవి చేజిక్కించుకున్న మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకి తొలి దెబ్బ తగిలింది.

విజయవాడలోని సత్యనారాయణ పురంలో ఉన్న నారాయణ స్కూల్ కి సరైన గుర్తింపు లేకుండానే నిర్వహిస్తున్నారని గతంలో మూడు సార్లు నోటీసులు ఇచ్చిన కానీ, ఎలాంటి స్పందన లేదని అందుకే ఆ స్కూల్ ని సీజ్ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్పారు. గతంలో కూడా ఒకే అడ్రస్ మీద పర్మిషన్ తీసుకోని, దాని మీద నాలుగైదు స్కూల్స్, కాలేజీలు రన్ చేస్తున్నారనే అభియోగాలు వచ్చాయి, కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో ఎవరు కూడా నారాయణ విద్యాసంస్థల వైపు కన్నెత్తి చూడలేదు..

ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా నారాయణతో పోటీ పడి మరి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో నారాయణకి సంబంధించి, ఆయన హయాంలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకోని రావటానికి ఆయా శాఖల అధికారులకి జగన్ పూర్తీ స్వేచ్ఛ ఇచ్చాడు. అందులో భాగంగానే అధికారులు నారాయణ స్కూల్ సీజ్ చేసి తొలి దెబ్బ కొట్టారు..మున్ముందు ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి..