చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు – డిప్యూటి సీఎం నారాయణ స్వామి

Monday, June 7th, 2021, 05:00:55 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి పక్ష పార్టీ అయిన తెలుగు దేశం అధికార పార్టీ వైసీపీ పాలన విధానం పై తరచూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో వైసీపీ కీలక నేత, డిప్యూటీ సిఎం నారాయణ స్వామి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం పై ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వెడురుకుప్పం లోని వాలంటీర్ల తో సమావేశం అయిన నారాయణ స్వామి ఈ మేరకు మాట్లాడుతూ చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలకు యెల్లో మీడియా వంత పాడుతోంది అని వ్యాఖ్యానించారు. అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన లో అభివృద్ది కనిపించడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే చంద్రబాబు ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు అంటూ విమర్శించారు. అయితే వాలంటీర్ల సేవలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు.