పీపుల్స్ స్టార్ … సినిమా ఆగిపోయిందా ?

Wednesday, November 30th, 2016, 07:37:42 PM IST

r-narayana-murthy
అంటే అవుననే అంటున్నాయి… ఫిలిం వర్గాలు? పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి హీరోగా బయటి బ్యానర్ లో చేస్తున్న రెండో సినిమా ”హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య”. గతంలో దాసరి స్వీయ దర్శకత్వంలో నారాయణమూర్తి నటించిన చిత్రం ”ఒరేయ్ రిక్షా” తరువాత ఎన్ని సూపర్ అవకాశాలు వచ్చినా నారాయణమూర్తి బయటి సినిమాల్లో నటించలేదు. చదలవాడ శ్రీనివాసరావు పై ఉన్న అభిమానంతో అయన ఈ సినిమాకు ఓకే చెప్పాడు. ఇందులో ఆయనకు జోడిగా సహజనటి జయసుధ నటిస్తుంది. ఇప్పటికే ఫిలింసిటీలో ఓ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు ? ‘బిచ్చగాడు’ సినిమాతో 25 కోట్ల బిజినెస్ సాధించి సంచలనం రేపిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడానికి ముఖ్య కారణం జయసుధ అని టాక్ ? అవునా… అదేంటి అంటే ఈ మధ్య కొందరు సీనియర్ నటులు మంచి డిసిప్లేన్ మైంటైన్ చేస్తూ షూటింగ్ కు టంచన్ గా వచ్చేస్తున్నారు. ఇంకొందరు సీనియర్స్ అయితే .. అస్సలు టైంకు రావడం లేదట .. అందులో జయసుధ కూడా ఉందని, ఆమె అస్సలు టైంకు రావడం లేదని, దాంతో దర్శకుడు ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా .. వినకపోగా దర్శకుడితో వాగ్వివాదానికి దిగి షూటింగ్ నుండి వెళ్లిపోయిందట!! దాంతో షూటింగ్ ఆగిపోయిందని టాక్. ఆ తరువాత ఆమెను కాంటాక్ట్ చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేదట .. మళ్ళీ ఆమె ఓకే చెబితే తప్ప ఈ షూటింగ్ మొదలు కాదమే?