ఇక దేశమంతా లాక్‌డౌన్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ..!

Tuesday, March 24th, 2020, 10:30:13 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా రెండో సారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే నేటి అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఇది ఒక రకంగా కర్ఫ్యూ లాంటిదే అని జనం దయ చేసి రోడ్లపైకి రాకండని విజ్ఞప్తి చేశారు.

అయితే రాబోయే ఈ 21 రోజులు మనకు చాలా కీలకమని కరోనా వైరస్ మొదట్లో కంటే ఇప్పుడు వేగంగా ప్రబలుతోందని ప్రధాని మోదీ హెచ్చరించారు. అయితే నిత్యవసరాల సరఫరా ఎప్పటిలాగే ఉంటుందని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. లాక్‌డౌన్ మనకు లక్ష్మణ రేఖ లాంటిదని దయచేసి అందరూ ఇళ్లకే పరిమితం కావాలని అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనాను ఎదురుకునేందుకు, వైద్యానికి కావలసిన అన్ని మౌళిక సదుపాయలని కల్పించేందుకు 1500 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపాడు.

అయితే కరోన బారిన పడిన ప్రతి ఒక్కరి కోసం వైద్యులు, వైద్య సిబ్బంది, కార్మికులు తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై ప్రాణాలను పణంగా పెట్టే వారు బాగుండాలని ప్రార్ధించాలని కోరారు. అటు పోలీసులు, భద్రతా సిబ్బంది, మీడియాకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.