మహేష్ నాకు వార్నింగ్ ఇచ్చారు : నరేష్

Wednesday, September 5th, 2018, 05:09:16 PM IST

మహేష్ బాబు 25వ చిత్రం మహర్షిపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇకపోతే అల్లరి నరేష్ మహర్షి సినిమాలో ప్రాధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ స్నేహితుడిగా కనిపించనున్నట్లు అందరూ ఫిక్స్ అయ్యారు.

అసలు విషయంలోకి వస్తే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నరేష్ మహర్షి సినిమా గురించి ప్రస్తావన రాగానే డిఫెరెంట్ ఆన్సర్ ఇచ్చాడు. మహేష్ కి పేదవాడైన ఫ్రెండ్ గా ఈ సినిమాలో నటిస్తున్నారట అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘గమ్యంలో నేను చేసిన గాలి శీను పాత్ర అందరికి ఎంత బాగా నచ్చిందో మహర్షి సినిమాలోని పాత్ర కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు 45 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను. మహేష్ బాబుతో మళ్ళీ 100 రోజులు కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ షెడ్యూల్ కోసం మళ్ళీ వెళ్లాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదని మహేష్ నాకు వార్నింగ్ ఇచ్చారు’ అని నరేష్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments