కమల్, పవన్ సీఎంలు..నరేష్ అభిప్రాయానికి ఫాన్స్ హ్యాపీ..!

Tuesday, November 7th, 2017, 04:57:09 PM IST

ప్రముఖ నటుడు నరేష్ చేసిన ఓ ట్వీట్ పవన్,కమల్ ల అభిమానులని ఖుషి చేస్తోంది. పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లు ముఖ్యమంత్రులైతే బావుంటుందనే అభిప్రాయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. లక్షల మంది ప్రజల, అభిమానుల కోరిక కూడా ఇదే అని నరేష్ అన్నారు. అదే జరిగితే ఎంజీఆర్, ఎన్టీఆర్ ల శకాన్ని మళ్లీ చూడొచ్చని అభిప్రాయ పడ్డారు. నరేష్ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా ఫాన్స్ నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయ వేడిని పెంచనున్నారు. ఇప్పటికే ఆదిశగా పవన్ పార్టీని బలోపేతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ రాజకీయాలు కూడా వాడి వేడిగా సాగుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అనుకున్న టైంలో తన వ్యాఖ్యలతో లోకనాయకుడు కమల్ హాసన్ హీట్ పెంచారు. తాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని కమల్ హాసన్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ విలక్షణ నటుడు హిందువులపై చేస్తున్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

  •  
  •  
  •  
  •  

Comments