ట్రైలర్ టాక్ : నరుడా డోనరుడా

Tuesday, September 27th, 2016, 05:12:11 PM IST

naruda
కొన్ని హిందీ సినిమాలు చూసి ఇలాంటివి తెలుగులో మన వాళ్ళు తీయగలరా అనిపిస్తుంది .. మరి కొన్ని చూస్తే తెలుగు లో అసలు తీయకపోవడమే బెటర్ లే అనిపిస్తుంది. అలాంటి సినిమాలలో ఒకటి విక్కీ డోనార్ .. హిందీ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా హక్కులు తెలుగులో హీరో సుమంత్ తీసుకున్నాడు. ఈ సినిమాకి నరుడా – డోనారుడా అనే పేరుని పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ లు విడుదల చేసినప్పుడే అందరూ ఆసక్తిగా చూసారు. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ కూడా విడుదల చేసారు. హీరో మహేష్ బాబు లాంచ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు అన్ని చోట్లా చక్కర్లు కొడుతోంది. ఏకంగా మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ చెయ్యడం తో అందరూ ఒక లుక్ వేస్తున్నారు. హిందీ లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన విక్కీ పాత్రని పేరు కూడా మార్చకుండా తెలుగులో సుమంత్ పోషిస్తున్నాడు. కథ మొత్తం అదే పెట్టేసారు డాక్టర్ స్థానం లో తనికెళ్ళ భరణిని తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ గా చెప్పాలి. డైలాగులు, సుమంత్ బాడీ లాంగ్వేజ్, తనికెళ్ళ భరణి కవ్వింపులూ ఇవన్నే కలిసి ట్రైలర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అషిమా రాయ్ పాత్రని బెంగాలీ హీరోయిన్ చేస్తోంది. ట్రైలర్ తోనే సినిమా కాన్సెప్టు మొత్తాన్ని చక్కగా చెప్పేశారు. అందుకే ఈ డోనరుడు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాడనే టాక్ వస్తోంది.