విక్రమ్ కోసం రంగంలోకి దిగిన నాసా

Thursday, September 12th, 2019, 04:08:49 PM IST

ఎన్నో కోట్ల ఆశలు మోసుకుంటూ నింగికెగిసి, చంద్రుడిపై భారతదేశ జెండాని రెపరెపలాడించటానికి అతి దగ్గరగా వెళ్లి చివరి నిమిషంలో తలెత్తిన చిన్నపాటి సమస్య వలన “హార్డ్ ల్యాండింగ్” అయ్యింది ల్యాండర్ విక్రమ్. చంద్రయాన్ -2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలంకావటంతో యావత్తు దేశం విచారం వ్యక్తం చేసింది. అయితే పడిపోయిన ల్యాండర్ ని గుర్తించే పనిలో ఉన్న ఇస్రో చాలా వరకు మంచి ఫలితాలు సాధించింది. ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయిన కానీ ముక్కలు ముక్కలు కాలేదని సింగిల్ పీస్ గానే ఉందని గుర్తించి దానితో సంబంధాలు పెంచుకోవటానికి కృషి చేస్తుంది.

అయితే అందులో అనుకున్నంత పురోగతి లేకపోవటంతో నాసా సహాయం కోరింది, దీనితో నాసా రంగంలోకి దిగి “కాలిఫోర్నియాలోని నాసా డీఎస్ఎన్ కేంద్రం విక్రమ్ ల్యాండర్‌కు శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాలు పంపినట్టు వెల్లడించారు. ‘‘చంద్రయాన్-2కి చెందిన విక్రమ్ ల్యాండర్‌ను ఉత్తేజపర్చేందుకు డీఎస్ఎన్ 24 బీమ్స్ 12 కిలోవాట్ల రేడియో ఫ్రీక్వెన్వీని నాసా చంద్రుడిపైకి పంపించింది. ఈఎంఈ (ఎర్త్ మూన్ ఎర్త్) మీదుగా 2103.7 మెగాహెడ్జిల నాసా సిగ్నల్ చంద్రుడిపై పడి తిరిగి భూమికి చేరింది” అని నాసా తరుపు శాస్త్రవేత్త ట్విట్టర్ లో పేర్కొన్నారు.

విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద కేవలం మన కాలమానం ప్రకారం 14 రోజులు మాత్రమే పనిచేసే విధంగా తయారుచేశారు. ఇప్పటికే దాదాపు వారం రోజులు కావస్తుంది, మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది, అంతలోపు ల్యాండర్ తో సంబంధాలు పునరిద్ధంచాలి, లేకపోతే ఆ తర్వాత అది సాధ్యం కాదు, అందుకే నాసా సహాయం కోరింది ఇస్రో. నాసా కూడా సపోర్ట్ ఇవ్వటానికి కూడా చంద్రయాన్ -2 ద్వారా వాళ్ళకి చాలా అవసరం ఉంది. అందుకే ఇస్రోకి సపోర్ట్ గా రంగంలోకి దిగింది.