పడుకొంటే .. 11 లక్షలు ఇస్తారట ?

Sunday, September 16th, 2018, 10:06:26 AM IST


ఏంటి ఒక్క రాత్రి పడుకుంటే .. పదకొండు లక్షలా అంటూ .. ఏదేదో ఊహించుకుంటున్నారా ? కొంపదీసి మీరు ఊహించుకున్న విషయం కాదు లెండి !! మీకెప్పుడు హీరోయిన్స్ విషయమే గుర్తొస్తుంది !! అసలు విషయంలోకి వెళితే .. ఈ మధ్య నెదర్లాండ్ కు సంబందించిన ఓ హోటల్ వాళ్ళు మా హోటల్ బెడ్స్ పై పడుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి .. దానికి మీకు మంచి నగదు బహుమతి ఇష్టం అంటూ జనాలను ఆకర్షించే ఆఫర్స్ ని ప్రకటిస్తున్నారు. తాజాగా నాసా అదే అంతరిక్ష పరిశోధన సంస్థ వాళ్ళు మరో క్రేజీ అఫర్ ని ప్రకటించింది. తమ అంతరిక్ష పరిశోధన ప్రయోగ శాలలో పడుకోండి .. 70 రోజులకు 11 లక్షలు సొంతం చేసుకోండి అంటూ యూత్ ని ఆకర్షించే ప్రకటన చేసింది. దాంతో పలువురు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అంతరిక్షంలో ఉంటె అక్కడ మనిషి రక్తనాళాల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మనిషి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నదానిపై స్టడీ చేస్తారట. అది విషయం !!

  •  
  •  
  •  
  •  

Comments