బీర్లు తాగే ఆ గర్ల్స్ ని చూస్తే భయమేస్తోంది: సీఎం

Sunday, February 11th, 2018, 12:43:39 AM IST

ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు మద్యానికి బాగా అలవాటు పడుతున్నారని వివిధ దేశాల్లో జరిపిన కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు అదే తరహాలో ఇండియాలో కూడా మద్యం సేవించే మహిళల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని గోవా ముఖ్యమంత్రి తెలియజేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కువగా అందులో యువతులు ఉన్నారని తెలిపారు. స్టేట్‌ యూత్‌ పార్లమెంట్‌ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ విషయం గురించి మాట్లాడారు.

ప్రస్తుత రోజుల్లో పర్యాటక నగరం గోవాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే బీర్లు తాగే అమ్మాయిల సంఖ్య బాగానే ఉందని చెప్పారు. నేను అందరిని అనడం లేదు. ఇక్కడ ఉన్న వారి గురించి కూడా కాదు. కానీ కొంత మంది పార్టీలంటూ బీర్లు తాగడం మొదలు పెట్టేశారు. ఆ అమ్మాయిలను చూస్తే భయమేస్తోందని, ఆ సంఖ్య ఎక్కువగా పెరిగిపోతోందని చెప్పారు. ఇక డ్రగ్స్ వంటి వాటి జోలికి యువత వెళ్లకూడదని వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.