డోంట్ మిస్: ఒబామా మెచ్చిన భారతీయ సింగర్

Wednesday, January 1st, 2020, 08:58:27 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు 2019 లో తనకు ఇష్టమైన 35 పాటలని సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. అయితే అందులో భారత సింగర్ ప్రతీక్ కుహద్ పాడిన కోల్డ్ మెస్ ని తన ఫేవరేట్ గీతంగా తెలిపాడు. హిప్ హాప్ పాటల నుండి దేశీయ గీతాలైన ఫోక్ సాంగ్స్ వరకు తన ఇష్టమైన పాటల్లో వున్నాయి అని తెలిపారు. అయితే లాంగ్ డ్రైవ్ లో కానీ, వ్యాయామం చేసేప్పుడు కానీ ఈ పాటలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

మూడు ఖండాలలో ముప్పై ప్రదర్శనలు చేసిన ప్రతీక్, యూఎస్, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్ మరియు ఇండియా లో ప్రదర్శితమైన తన పాటని ఒబామా పేర్కొనడం పట్ల చాల ఆశ్చర్యానికి గురయినట్లు తెలిపారు. 2019 కి ఇంత మంచి గుర్తింపు వస్తుందని ఊహించలేదు అని అన్నారు ప్రతీక్ కుహద్. కోల్డ్ మెస్ స్పాటిఫై లో 3,621,169 సార్లు మరియు జియోస్నాప్ లో 2,849,647 సార్లు ప్రసారం చేయడం జరిగింది. అయితే దార్ గై దర్శకత్వం వహించిన ఈ వీడియో లో జిమ్ సర్బ్ మరియు జోయా హుస్సేన్ నటించారు. యూట్యూబ్ లో ఈ పాటకి 4.9 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.