మొబైల్ ఫోన్ చోరీలకు టెలికాంశాఖ చెక్!

Friday, February 2nd, 2018, 12:08:45 PM IST

ఇటీవలి కాలం లో సెల్ ఫోన్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. దాదాపుగా ప్రతిఒక్కరు కేవలం ఫోన్ ను ఒక కాల్స్ మాట్లాడే వస్తువుగా కాకుండా వారి వ్యక్తిగత విషయాల తాలూకు సమాచారం కూడా భద్రపరుస్తన్నారు. ఇంతవరకు బానే వున్నా ఒకవేళ ఆ ఫోన్ పోయిందంటేనే అసలు సమస్య మొదలవుతుంది. దానిలోని కాంటాక్ట్స్ కోల్పోవడం, ఏదైనా ముఖ్య సమాచారం అందులో భద్రపరిస్తే అది ఎవరైనా చూసి ఏ విధంగా దానిని వినియోగిస్తారో ఏమో అనే భయం ఉండేది. ఇప్పటివరకు మన ఫోన్ పోయినా లేక ఎవరైనా దొంగిలించినా దానిలోని సిమ్ కార్డు మార్చి, ఐయంఈఐ నెంబర్ మార్చడం వంటివి చేసి వినియోగించడం చూస్తున్నాం. కానీ టెలికాం శాఖ త్వరలో తీసుకురానున్న సెంట్రల్ ఎక్విప్మెంట్స్ ఐడెంటిఫై రిజిస్టర్ అనే ఒక నూతన సర్వీస్ ని డీవోటీ ద్వారా ఏర్పాటు చేయనుంది. దీని కొరకు బడ్జెట్ లో రూ. 15 కోట్లు కూడా కేటాయించడం జరిగిందని తెలుస్తోంది. ఈ విధానం ద్వారా మన ఫోన్ పోయినా, లేక ఎవరైనా దొంగిలించినా వారు సిమ్ మార్పు, ఐయంఈఐ నెంబర్ మార్పు వంటివి చేసినా ఆ ఫోన్ ని పనిచేయకుండా బ్లాక్ చేయవచని తెలుస్తోంది. మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడం అనేది వినియోగదారుడికి ఆర్ధిక నష్టమే కాకుండా, అది అతని వ్యక్తిగత జీవితానికి, మరియు దేశ భద్రతకు కూడా ముప్పే అని ప్రభుత్వం పేర్కొంటోంది. నకిలీ మొబైల్ ఫోన్ లను నిరోధించడం, ఫోన్ లు చోరీ కి గురికావడం వంటివి నిరోధించడానికి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అందరూ మొబైల్ ఆపరేటర్లు తమ ఐయంఈఐ డేటా బేస్ కు ఈ సీఈఐఆర్‌ ను అనుసంధానం చేయడం ద్వారా చర్యలు తీసుకోవచ్చు. అలానే ఐయంఈఐ టాంపరింగ్ చేయడం నేరమని దానికి కనీసం మూడు సంవత్సరాల శిక్ష పడేలా ప్రభుత్వం డీవోటీ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి ఈ సేవ అమలులోకి వస్తే మొబైల్ చోరీలు చాలా వరకు అదుపులోకి వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు….