సముద్రంలో మిస్సైన షిప్.. హైజాక్ అనుమానం?

Saturday, February 3rd, 2018, 07:06:25 PM IST

సముద్రంలో ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరికీ తెలియదు. ఓ వైపు ప్రకృతి ఆగ్రహం మరో వైపు తీవ్ర వాదుల హైజాక్ హెచ్చరికలు అని చాలా ఎదురవుతుంటాయి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. షిప్ లు మిస్ అవుతున్నాయని ఆ తరువాత వాటి జాడ కొంచెం కూడా దొరకడం లేదు అనే పిర్యాదులు కేంద్రానికి ఎక్కువగా అందుతున్నాయి. ఇక రీసెంట్ గా మరొక నౌక మిస్ అయ్యింది. దీంతో భారత తీర రక్షక దళం గాలింపు చర్యలు చెప్పట్టింది. గత 48 గంటల క్రితం పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్‌ ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంటీ మెరైన్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఆచూకీ దొరకడం లేదు. రక్షణ దళాలు అందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. షిప్ లో దాదాపు 52 కోట్ల రూపాయల విలువ చేసే గ్యాసోలిన్ ఉంది. అలాగే షిప్ లో 22 మంది సెయిలర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఎవరైనా హైజాక్ చేశారా అనే కోణంలో భారత రక్షణ దళాలు సముద్రంలో వెతకటం మొదలు పెట్టారు. అందుకు సమీపాన ఉన్న నైజీరియా, బెనిన్ దేశాల సహాయాన్ని కూడా భారత్ తీసుకుంటోంది.