దిక్కుతోచని స్థితి లో పాకిస్తాన్ – బాలీవుడ్ సినిమాలే దిక్కు

Wednesday, January 18th, 2017, 03:08:48 PM IST


యురీ దాడి తరవాత పాకిస్తాన్ సినిమా నటుల మీద బాలీవుడ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం మీద పాకిస్తాన్ కూడా సీరియస్ గానే స్పందించింది. ఆ దేశం లో బాలీవుడ్ సినిమాలు అన్నిటిమీదా నిషేధం విధించింది ఆ దేశం.ఈ నిర్ణయంతో అక్కడి సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. వాస్తవానికి పాక్ థియేటర్లకు 70 శాతం ఆదాయం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ద్వారానే వస్తుంది. దీంతో, థియేటర్ యాజమాన్యాల అభిప్రాయాలను కనుక్కునేందుకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని వేసింది. సమాచార మంత్రి మర్యూమ్ ఔరంగజేబ్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధాని సలహాదారు కూడా సభ్యుడిగా ఉన్నారు. కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం బాలీవుడ్ సినిమాల మీద నిషేధం ఎత్తేసే ప్రక్రియ త్వరలో తీసెయ బోతున్నారు. కొన్ని నిబంధనలకి లోబడి ఈ వ్యవహారం నడుస్తుంది. ఇదివరకు లాగా కాకుండా రెండు లేదా మూడు భారతీయ సినిమాలు మాత్రమే నెలలో అక్కడ అనుమతి ఇస్తారు.