ఆ హెల్మెట్ ధరిస్తే మనం వెళ్లే మార్గం తెలుసుకోవడం సులభం !

Friday, February 23rd, 2018, 12:20:20 AM IST

నేటి డిజిటల్ కాలంలో టెక్నలజి రోజుకో రకమైన నూత ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతోంది. మొబైల్ ఫోన్ మానవుడు అత్యావశ్యక వస్తువయిన ఈ రోజుల్లో మనం ఏదైనా కొత్త సిటీకో, లేక పల్లెకో వెళ్ళినపుడు మనకు రూట్ తెలియకపోతే ఫోన్లో గూగుల్ మ్యాప్ చూడడం ద్వారా దిక్కులు, పరిసరాలు తెలుసుకుని గమ్యం చేరుకోవడం చేస్తుంటాము. ఆ విధంగా నేడు మొబైల్ అనేది మానవుడి ఆవశ్యక వస్తువుల్లో ప్రధమ స్థానంలో నిలుస్తోంది. అలానే మనం ద్విచక్ర వాహనం మీద వెళుతుంటే ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ మధ్య ప్రభుత్వం హెల్మెట్ ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

కాగా మొబైల్ ను, మరియు హెల్మెట్ అనుసంధానం చేస్తూ హెల్మెట్ లోనే నిక్షిప్తమయ్యే ఒక బ్లూటూత్ డివైస్ ను కనుగొన్నారు కర్ణాటక కు చెందిన యోగేష్, అభిజీత్ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ హెల్మెట్ లో బ్లూటూత్ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి మనం ఏదైనా తెలియని చోటికి వెళ్ళినపుడు రూట్ తెలియకపోతే ఇక ఫై ప్రత్యేకంగా ఫోన్ లో మ్యాప్స్ ఓపెన్ చేయనవసరం లేకుండా మనం వాహనం ఎక్కినపుడే మొబైల్ కి మన హెల్మెట్ లోని బ్లూటూత్ ను అనుసంధానిస్తే సరి. రూట్ నావిగేషన్ ద్వారా మనం వెళ్లే రూట్ కరెక్టా కాదా, ఎటు వైపు వెళ్ళాలి అనేది బ్లూటూత్ ద్వారా మనకు చెపుతుంది. ఈ విధంగా వినియోగదారుడికి చాలా వరకు రూట్ లు వెతుక్కునే సమస్యకు చెక్ పెట్టినట్లే అని వారు అబిప్రాయపడుతున్నారు. కాగా దీని ధర కూడా అందరికి అందుబాటు లోనే రూ.1500 మాత్రమే అని వారిరువురు అంటున్నారు….