కదిలే రైలులో కళ్యాణం…

Friday, March 2nd, 2018, 03:31:05 PM IST

చుకు చుకు రైలు వస్తుంది.. పెండ్లికి మీరూ రారండి…

రైలు కూతలే కళ్యాణ వాయిద్యాలు…

ప్రతిఒక్కరి జీవితంలో వి వాహం మధుర ఘట్టం. కొందరు పెండ్లిళ్లు కళ్యాణ మండపాల్లో, కొబ్బరితోటల్లో చేస్కుంటే, మరికొందరు వినూత్నంగా జరుపుకుంటున్నారు. తాజాగా ఓ జంట కదులుతున్న రైలు లో వివాహం చేసుకున్నది. అదేమంటే స్టైల్ ఆఫ్ లివింగ్ అంట. అయితే ఈ వివాహాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు, శ్రీ శ్రీ రవిశంకర్‌ప్రసాద్ జరిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో-గోరఖ్‌పూర్ మధ్య నడుస్తున్న రైలులో బుధవారం ఫార్మసిస్టు సచిన్‌కుమార్, పన్నుల శాఖ ఉద్యోగిని జ్యోత్స్నసింగ్‌పటేల్ వివాహమాడారు. పెండ్లి సింపుల్‌గా చేసుకోవడానికి ఇదోమార్గం, చెప్పుకోవడానికి కుడా కొత్తగా కాస్త ఇంట్రెస్ట్ ఫుల్ గా ఉంటుంది కదూ. ఇదంతా ఎలా అని వరుడు రవి కుమార్ ని ప్రశ్నించగా పెండ్లి సాధారణంగా జరుగాలని నాకోరిక. ఇది అందరికీ చెప్పాలనుకున్నా. అప్పులు చేసి, లక్షలు ఖర్చుపెట్టి పెండ్లి చేయనవసరం లేదు అని రవిశంకర్ తెలిపారు. సచిన్ యూపీలోని కౌసాంబి జిల్లా ఉధాని ఖుర్డ్ గ్రామవాసి కాగా, జ్యోత్స్న కేంద్ర పన్నుల విభాగంలో ఉద్యోగిని. యూపీలో పర్యటనకు రవిశంకర్ తీసుకున్న ప్రత్యేక రైలులో చుకుచుకు రైలుకూతల మధ్య వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. భారత రైల్వే చరిత్రలో కదులుతున్న రైలులో కళ్యాణం జరుగడం ఇదే ప్రథమం అని రవిశంకర్ అభిమానులు ట్విట్టర్‌లో పోస్టుచేశారు.

  •  
  •  
  •  
  •  

Comments