ఏం సాధించావు బాలయ్యా?

Monday, September 15th, 2014, 07:02:17 PM IST


ప్రముఖ సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై విపక్ష పార్టీ నేతలైనవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హిందూపూర్ వైకాపా పార్టీ సమన్వయ కర్త నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ బాలకృష్ణ ఎమ్మెల్యేగా వంద రోజుల్లో ఏమి సాధించారో శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ బాలకృష్ణ మూడు ప్రారంభోత్సవాలు, ఆరు భూమి పూజలు, తొమ్మిది చెట్లు నాటడం తప్ప చేసింది ఏమీ లేదంటూ దుయ్యబట్టారు. అలాగే హిందూపురం నియోజకవర్గం ప్రజలకు బాలయ్య ఏం సేవ చేశారో చెప్పి తీరాలని నవీన్ నిశ్చల్ డిమాండ్ చేశారు. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ నిశ్చల్ గట్టి పోటీని ఇచ్చారు.