సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన నేవీ వైస్ అడ్మిరల్.. ఎందుకంటే..!

Saturday, June 27th, 2020, 02:38:31 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌కి నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ లేఖ రాశారు. గాల్వన్ ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌ బాబు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయిన సీఎం కేసీఆర్ అనంతరం సూర్యాపేట వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చి సంతోష్ భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగం, హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలం, 5 కోట్ల రూపాయల చెక్ స్వయంగా అందచేశారు.

అయితే కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ చేసిన సాయానికి నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వైస్ అడ్మిరల్ రెండు పేజీల లేఖను రాశారు. అలాగే ఏపీలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్‌‌ను ఓ సారి సందర్శించవలసిందిగా సీఎం కేసీఆర్‌ను పవార్ ఆహ్వానించారు. ఎందరో సైనికులను తయారు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థలో తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు.