హిట్టా లేక ఫట్టా : నవాబ్ మణిరత్నం అభిమానులకు మాత్రమే.

Friday, September 28th, 2018, 02:59:45 PM IST

సంచలన దర్శకుడు మణిరత్నం ఒకప్పుడు తన చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్నారు,కానీ ఆ తర్వాత అస్సలు టైం ఏం బాలేదు.వరుసగా అన్ని ప్లాపులే ఎదురయ్యాయి,అయినా సరే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలతో వచ్చేవారు.ఈ సారి కూడా అదే విధంగా ప్రేక్షకుల ముందుకు శింబు హీరోగా విజయ్ సేతుపతి,అరవింద్ స్వామి ప్రధాన పాత్రధారులుగా,ప్రకాష్ రాజ్ మరియు జయసుధ,జ్యోతిక వంటి నటుల ప్రధాన తారాగణంతో ఏ ఆర్ రెహమాన్ సంగీతంలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తన తండ్రి మరణానంతరం ఆ స్థానం దక్కించుకోవడం కోసం ఈ ముగ్గురు అన్నతమ్ములు ఎదురైన సంఘటనలు ఏమిటి అనేది అసలు కథ.

ఈ చిత్రంలో ముఖ్యపాత్రదారుడు ప్రకాష్ రాజ్ ఒక మాఫియా చక్రవర్తి తన తనయులు శింబు,అరవింద స్వామి మరియు అరుణ్ విజయ్లు.ఒక ఊహించని ఘటన ద్వారా ప్రకాష్ రాజ్ మరియు జయసుధలు మీద ఒక హత్యా ప్రయత్నం జరుగుతుంది,దీనిలో ఇద్దరు ముందు ప్రాణాలతో బయటపడినా..ఆ ప్రయత్నం ఎవరు చేసారు అన్న దాని మీద ఆరా తీసే క్రమంలో ప్రకాష్ రాజ్ గుండె పోటుతో మరణిస్తాడు.దీనితో తన తండ్రి స్థానం కోసం ఈ ముగ్గురి అన్నతమ్ములు మధ్య సంఘర్షణలు ఒకరి మీద ఒకరి అనుమానాలు వ్యక్తం అవుతాయి.ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి అవకాశంగా తీసుకొని ఎవరికి సాయపడతాడు,అసలు వీరికి విజయ్ సేతుపతికి సంబంధం ఏమిటి అన్నదే సారాంశం.

చిత్రానికి సంబంధించి మణిరత్నం ఎప్పటిలానే తనదైన శైలిలో తెరకెక్కించారు.ఈ చిత్రంలో ప్రతీ ఒక్క నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.పెద్ద తారాగణం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.విజయ్ సేతుపతి యొక్క పాత్ర ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది.అక్కడక్కడా వచ్చే కామెడీ సన్నివేశాలతో,కొన్ని ఎమోషనల్ సీన్లతో మొదటి భాగం బాగానే ఆకట్టుకుంటుంది.సెకండాఫ్ కి వచ్చే సరికి సినిమా నెమ్మదిగా సాగుతున్న అనుభవమైతే ప్రేక్షకుడు పొందుతాడు,కొన్ని అనవసరమైన సన్నివేశాలు,అక్కడక్కడా మణిరత్నం మార్క్ మిస్ అవుతున్న సందేహం కూడా వస్తుంది.మొత్తానికి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఐతే ఈ చిత్రం నచ్చకపోవచ్చు కానీ మణిరత్నం అభిమానులకి మాత్రం నచ్చుతుంది.ఈ మధ్య కాలంలో వచ్చిన మణిరత్నం సినిమాలతో పోల్చితే ఈ చిత్రం పరవాలేదని చెప్పొచ్చు.

అన్నతమ్ముల సంఘర్షణమయం

Reviewed By 123telugu.com |Rating : 2.75/5

మణిరత్నం తిరిగొచ్చాడు కానీ.

Reviewed By samyam.com |Rating : 3/5

మణిరత్నం మార్క్ సినిమా

Reviewed By mirchi9.com |Rating : 3/5

ఉత్కంఠభరిత గ్యాంగ్స్టర్ డ్రామా

Reviewed By greartandhra.com|Rating : 3/5