వాళ్ళ సినిమాల మీద మోజు తగ్గించుకోండి – హీరో వార్నింగ్ :

Tuesday, November 8th, 2016, 04:02:03 PM IST

nawazuddin-siddiqui
ఇప్పుడు ప్రతీ టాలీవుడ్ నటీ నటుడు బాలీవుడ్ వైపు చూస్తున్నారు అలాగే అక్కడి వారు హాలీవుడ్ వైపు చూస్తున్నారు. హాలీవుడ్ లో నటించడం అనేది పెద్ద ఫేమస్ వ్యవహారంగా మారుతున్న టైం లో ఇలాంటి మోజు పెంచుకోవడం మంచిది కానే కాదు అంటున్నాడు హీరో నవాజుద్దీన్ సిద్దిక్కీ. బాలీవుడ్ సినిమాలు వాటంతట అవే అంతర్జాతీయంగా ఫేమస్ అవుతున్న తరుణం లో మనవారికి ఆ రకమైన మూర్ఖపు మోజు ఎందుకు అంటున్నాడు నవాజుద్దీన్. ఒక పక్క విదేశాల్లో అద్భుత కలక్షన్ లతో ఇండియన్ సినిమాకి మంచి పేరు వస్తున్న టైం లో హాలీవుడ్ మాత్రమే గొప్ప అన్నట్టు మనోళ్లు హడావిడి చెయ్యడం కామెడీ గా ఉంది అంటున్నాడు ఆయన. బాలీవుడ్ లో రూపొందిన ‘రమన్‌ రాఘవ్‌ 2.0’, ‘గ్యాంగ్‌ ఆఫ్‌ వస్సేపూర్‌’, ‘మిస్‌ లవ్లీ’, ‘ది లంచ్‌ బాక్స్‌’ వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలతోపాటు విదేశాల్లో మంచి వసూళ్లు సాధించాయని గుర్తు చేశాడు. అలాంటప్పుడు హాలీవుడ్ కు వెళ్లాలన్న అత్యుత్సాహం ఎందుకని ప్రశ్నించాడు. మన సినీ పరిశ్రమే హాలీవుడ్ కు దీటుగా ఎదుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటని అన్నాడు.