నయనతార అంటే ..పడి చచ్చిపోతున్నారు ?

Saturday, January 28th, 2017, 10:56:19 AM IST

nayanatara
గ్లామర్ భామ నయనతార క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు అంటే ఇప్పుడు తమిళ జనాలకు తెగ ఇంట్రెస్ట్ పెరిగింది. సౌత్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం తమిళంలోనే సినిమాలు చేస్తూ బిజీగా మారింది. నయనతార సినిమాలంటే జనాలు సూపర్ హిట్ చేస్తున్నారట. ఆ సినిమాలో నయనతార ఉందా .. తప్పకుండా అది సూపర్ హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. దాంతో ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు? ఇక గత ఏడాది మోస్ట్ డిజైరబుల్ విమెన్ అఫ్ చెన్నై గా కిరీటం దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది కూడా నయనతారకు ఓట్లు పడ్డాయి. ఇలా వరుసగా తమిళ జనాల ఇష్టాన్ని పొందిన హీరోయిన్ గా సంచలనం రేపింది. నాయన ప్రస్తుతం రెండు భిన్నమైన సినిమాలు చేస్తుంది.