`భార‌తీయుడు-2`లో అందాల న‌య‌నం?

Tuesday, January 30th, 2018, 09:01:30 PM IST

అవినీతిపై శంక‌ర్ ప్ర‌యోగించిన అస్త్రం `భార‌తీయుడు`. క‌మ‌ల్‌హాస‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. తెలుగులో భార‌తీయుడుగా, త‌మిళంలో ఇండియ‌న్‌గా, హిందీలో హిందూస్తాన్‌గా రిలీజై అన్నిచోట్లా భారీ వ‌సూళ్లు సాధించింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రోబో 2 టెన్ష‌న్ వ‌దిలిపోగానే, ఇక త‌దుప‌రి భార‌తీయుడు -2 పనిలోకి పూర్తిగా దిగిపోతాడుట శంక‌ర్‌. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లయ్యాయి. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

తాజాగా ఈ సినిమాలో న‌టించే క‌థానాయిక ఎవ‌ర‌న్న‌దానిపై మంత‌నాలు సాగుతున్నాయిట‌. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న అందాల న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తే బావుంటుంద‌ని శంక‌ర్ బృందం భావిస్తోందిట‌. క‌మ‌ల్ లాంటి క్రేజీ హీరో స‌ర‌స‌న న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తే ఆ సినిమాకి ఉండే ప్ర‌త్యేక‌తే వేరుగా ఉంటుందని ఆలోచించారుట‌. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ సాగుతోంది. ప్ర‌స్తుత కాలానికి త‌గ్గ‌ట్టు అవినీతిలో పెరిగిన స్థాయికి త‌గ్గ‌ట్టు స‌రికొత్త భార‌తీయుడుని తయారు చేసే ప‌నిలో ఉన్నాడుట శంక‌ర్‌.