వై ఎస్ బయోపిక్ లో నయనతార ?

Friday, March 9th, 2018, 10:19:03 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లోకూడా బయోపిక్ సినిమాల హవా బాగా పెరుగుతుంది. ఇప్పటికే మహానటుడు ఎన్టీఆర్, టెన్నిస్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ల జీవిత కథలతో సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్. లేటెస్ట్ గా ఆనందో బ్రహ్మ సినిమాతో హిట్ అందుకున్న ఈ దర్శకుడు వై ఎస్ జీవితంతో తెరకెక్కించే కథలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో వై ఎస్ భార్య పాత్రలో గ్లామర్ భామ నయనతార నటిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా విషయంలో దర్శకుడు నయనతారను కలిసినట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. మమ్ముట్టి తో నయనతార ఇదివరకే భాస్కర్ ది రాస్కెల్, పుతియా నియమం చిత్రాల్లో నటించగా అవి సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ అంటే ఇప్పుడు హాట్ కేక్. ఆ క్రేజ్ ని తన సినిమాకు కాష్ చేసుకోవాలనే ప్లాన్ తో దర్శకుడు నయనతారను తీసుకుంటున్నాడని టాక్.