నయనతార ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

Friday, April 20th, 2018, 03:38:17 PM IST

సౌత్ హాట్ భామ నయనతార భలే ప్లాన్ వేసిందబ్బా !! ఇప్పటికే ఈ అమ్మడు దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఓ ఇంటివారు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి షికార్లు చేయడం .. డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ ని హీరోగా పరిచయం చేసే పనిలో పడిందట !! తాజాగా విగ్నేష్ శివన్ ఓ మంచి కథను సిద్ధం చేసాడట. అందులో నయనతారను హీరోయిన్ గా తీసుకున్నాడట, అయితే హీరో కోసం అన్వేషణలో పడ్డ విఘేషు కు హీరో ఎవరో ఎందుకు నువ్వే చేయొచ్చుగా అని సలహా ఇచ్చిందట. అంతే కాదు .. తనతో సినిమా చేయడానికి వచ్చే నిర్మాతలకు కూడా విగ్నేష్ ని హీరోగా తీసుకుంటేనే నేను హీరోయిన్ గా నటిస్తానని కండిషన్స్ పై కండిషన్స్ పెడుతుందట. తన బాయ్ ఫ్రెండ్ ని హీరోగా చూడాలని ప్లాన్ వేసినట్టుంది .. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా ? చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments