మరోసారి భయపెడతానంటున్న నయనతార ?

Tuesday, April 3rd, 2018, 10:31:37 PM IST


సౌత్ లో సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నయనతార మెగాస్టార్ సరసన సైరా సినిమాలో నటిస్తుంది. ఇక తమిళంలో ఈ అమ్మడు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో తన హవా చాటుకుంటూనే ఉంది. ఇప్పటికే డోరా, మాయ వంటి హర్రర్ సినిమాల్లో నటించిన నయనతార తాజాగా మరో హారర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తుందట. తాజాగా హిందీలో అనుష్క శర్మ నటించిన సూపర్ హిట్ చిత్రం పరి సినిమాకు రీమేక్ గా తమిళ తెలుగు భాషల్లో చేయాలనీ ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే నయనతారతో దర్శక నిర్మాతలు చర్చలు జరిపాడానికి రెడీ ఆవుతున్నారట. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హిందీలో అనుష్క శర్మ నటించిన పరి చిత్రం మంచి విజయం అందుకుంది.