సీక్రెట్ గా నయన్ పెళ్లి అయిపోయిందా?

Saturday, October 28th, 2017, 01:01:32 PM IST

టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారల్లో నాయన తార ఒకరు. పర్సనల్ లైఫ్ లో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ హీరోయిన్ ప్రస్తుతం సినీ కెరీర్ ని మాత్రం చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. తెలుగులో చిరంజీవీ ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ్ లో కూడామరి కొన్ని సినిమాలతో బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం నయన తార గురించి కోలీవుడ్ ఒక న్యూస్ చాలా వైరల్ అవుతోంది. అమ్మడు యువ దర్శకుడైన విగ్నేష్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ఆర్య సమాజ్ లో ఎవ్వరికి తెలియకుండా కేవలం సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు కొన్ని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే నయననే వివరణ ఇవ్వాలి.