కాబోయో వాడికి స్టేజ్ పైనే థ్యాంక్స్.. నయన వెడ్డింగ్ బెల్స్!

Wednesday, March 28th, 2018, 06:42:04 PM IST

కోలీవుడ్ లో గత కొంత కాలంగా హాట్ టాపిక్ అవుతోన్న విషయం ఏదైనా ఉందా అని అంటే కేవలం నయనతార పెళ్లి గురించే. సౌత్ లో కూడా ఈ మధ్య అమ్మడి పెళ్లి విషయంపై అనేక రూమర్స్ వస్తున్నాయి. విగ్నేష్ అనే యువ దర్శకుడితో నయనతార చాలా రోజులుగా సన్నహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. డైరెక్ట్ గా చెప్పకుండానే అతనితో విహారయాత్రలు చేస్తూ.. ప్రేమలో వున్నట్లు కొన్ని ఫొటోల ద్వారా చెప్పేసింది. మరో వైపు విగ్నేష్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నాడు.

అయితే వీరు ఇంత వరకు బహిరంగంగా ప్రేమలో ఉన్నట్లు చెప్పలేదు. మీడియా అడిగే ప్రయత్నం చేసినప్పటికీ ఆన్సర్ ఇవ్వలేదు. ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా నయనతార చేసిన ఒక కామెంట్ గురించి వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇప్పటికే కోలీవుడ్ లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. చెన్నైలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో తనకు కాబోయే వ్యక్తికి కృతజ్ఞతలని స్టేజ్ పైనే చెప్పేసింది. దీంతో ఆమె పెళ్లి పీటలు ఎక్కేందుకు ముహూర్తం దగ్గరపడిందని తమిళనాడు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే!