సినిమావాళ్ల సంఘీభావం మాక‌క్క‌ర్లే!

Friday, January 20th, 2017, 10:21:44 AM IST

nazar
ప్ర‌స్తుతం జ‌ల్లికట్టు నిషేధానికి వ్య‌తిరేకంగా త‌మిళ తంబీలంతా రోడ్ల‌పైకి వ‌చ్చి ఉద్య‌మాలు చేస్తున్నారు. చెన్న‌య్ మెరీనా బీచ్ ఊక వేస్తే రాల‌నంత‌మంది జ‌నాల‌తో నిండిపోయింది. ఇక్క‌డికి త‌మిళులంతా గుంపులు గుంపులుగా వ‌చ్చి చేరుతున్నారు. రేయింబ‌వ‌ళ్లు అక్క‌డే ప‌డిగాపులు ప‌డుతూ ఉద్య‌మిస్తున్నారు. ఈ ముట్ట‌డి చూస్తుంటే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని త‌ల‌పిస్తోంది.

అయితే సినిమా వాళ్లు మాత్రం కాస్తంత తాపీగా మేక‌ప్ వేసుకుని ప‌ది గంట‌ల‌కు ఆ ప్లేస్‌కి దిగ‌బ‌డ‌డంతో .. మాకు సినిమావాళ్ల మ‌ద్ధ‌తు వ‌ద్దంటూ విద్యార్థి సంఘాలు తిర‌స్క‌రించాయి. నిరాహార ధీక్ష‌కు రాన‌క్క‌ర్లేద‌ని గుర్రుమ‌న్నారు. దీంతో న‌డిగ‌ర‌సంఘం త‌ర‌పున నాజ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సొచ్చింది. మేం కూడా మీలో భాగ‌మే. మా మ‌ద్ధ‌తు మీకు నేరుగా ఉంటుంది అంటూ నాజ‌ర్ మీడియా ముందే వివ‌ర‌ణ ఇచ్చారు. త‌మిళ సినీప‌రిశ్ర‌మ యావ‌త్తూ బంద్‌కి మ‌ద్ధ‌తు ప‌లికింది. అయితే అక్క‌డ ఉడుకు నెత్తురు మాత్రం సినిమావాళ్లు మాకొద్దు. మేం ఎప్ప‌టినుంచో ఈ ధీక్ష‌లు చేస్తుంటే సినిమావాళ్లంతా ఇప్పుడొస్తారా? మాకొద్దు పోండి.. అంటూ తిర‌స్క‌రించారు. న‌డిగ‌ర సంఘం అధ్య‌క్షుడు నాజ‌ర్ దీనికి ఓ రేంజులో వివ‌ర‌ణ ఇచ్చుకుని తెర‌వెన‌క్కి వెళ్లారు.