అక్కడ మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు!

Tuesday, May 19th, 2020, 11:56:45 PM IST

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది మరణానికి కారణం అవుతోంది. అయితే ఈ వైరస్ రష్యా లో సైతం వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గినట్లు గా కనిపించినా, రష్యా లో మాత్రం రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.రోజురోజుకీ నమోదు అవుతున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అక్కడే కరోనా విలయ తాండవం తో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అయితే రష్యా లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ప్రస్తుతం 3 లక్షలకు చేరువలో ఉంది.

కేవలం గడిచిన 24 గంటల్లో 9,263 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అక్కడి రాజధాని ప్రాంతం అయిన మాస్కో లో 3,545 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.అయితే కొత్తగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్యతో మొత్తం 2,99,941 కి చేరింది. గత నాలుగు రోజుల నుండి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇలా నమోదు కావడం అక్కడి వారిని ఆందోళన కలిగేలా చేస్తోంది. అయితే అక్కడ కరోనా వైరస్ మహమ్మారి ద్వారా మరణించిన వారి సంఖ్య 2,837 కి చేరింది.