బన్నీ పై అంత రిస్క్ అవసరమా?

Thursday, February 15th, 2018, 06:55:48 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ మెగా ఫోన్ పడుతున్న చిత్రం నా పేరు సూర్య. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్ర ఫస్ట్ ఇంపాక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, విడుదలయిన పాటలు పెద్దగా ఆదరణ పొందలేకపోయాయి. కాగా వేసవి కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 26న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర నైజాం హక్కులను ఇటీవల ప్రసాద్ అనే డిస్ట్రిబ్యూటర్ అత్యధికంగా రూ 21.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్పైడర్, అజ్ఞాతవాసి చిత్రాలను భారీ ధరలకు కొన్న నిర్మాత దిల్ రాజుకు తగిలి దెబ్బ మామూలుది కాదు, ఆ దెబ్బలకు ఆయన పెద్ద చిత్రాలేవీ ఇప్పట్లో కొనటానికి ముందుకు రాక పోవచ్చని సమాచారం. అయితే ఇప్పుడు ఇంత ధర పెట్టి బన్నీ సినిమాని కొన్నారంటే అది పెద్ద రిస్కె అవుతుంద.

నిజానికి ఇప్పటికే సమ్మర్ బరిలో మహేష్, రజిని కాంత్ చిత్రాలు వున్నాయి. అందువల్ల థియేటర్లను మూడు చిత్రాలు పంచుకోవలసి ఉంటుంది. పైగా సూపర్ స్టార్ మహేష్ తో పోలిస్తే బన్నీకి నైజాం లో అంత మార్కెట్ లేదనే చెప్పాలి. బన్నీ గత చిత్రం డీజే కూడా డిస్ట్రిబ్యూటర్కు నష్టాన్నే మిగిల్చింది, అందునా ఈ ముక్కోణపు పోటీలో విజేతగా నిలిచినప్పటికీ మొత్తంగా అంతమొత్తం కలెక్ట్ చేయవచ్చని తెలుస్తోంది. మరి అదే నిజమైతే పంపిణీదారులు ఇంత ధరపెట్టి కొన్నారన్నది నిజమా లేక సినిమా మీద క్రేజ్ తీసుకురావడానికి ఈ వార్తను బయటకి తెచ్చారా అనేది తెలియడం లేదు…..