అక్కా చెల్లెళ్లు ఆయారాం గ‌యారాం

Saturday, September 8th, 2018, 05:45:46 PM IST

నేహా శ‌ర్మ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. మోడ‌లింగ్ రంగం నుంచి సినీరంగం వైపు వ‌చ్చిన ఈ బ్యూటీ ఆరంభ‌మే రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న చిరుత చిత్రంలో అవ‌కాశం అందుకుంది. అయితే తొలి సినిమా త‌న‌కు పేరు తెచ్చినా ఎందుక‌నో టాలీవుడ్‌లో న‌టించేందుకు నేహా ఆస‌క్తి చూపించ‌లేదు. ఆ క్ర‌మంలోనే బాలీవుడ్‌లో ప‌లు చిన్నా చిత‌కా సినిమాల్లో న‌టించింది.ఇటీవ‌లే ముబార‌క‌న్‌, సోలో (దుల్కార్‌) చిత్రాల‌తో విజ‌యాలు అందుకుంది. ప్ర‌స్తుతం కిలాడీ అక్ష‌య్ కుమార్, సునీల్ శెట్టి త‌దిత‌రులు న‌టిస్తున్న‌ హేరాఫేరి 3 లాంటి చిత్రంలో న‌టిస్తూ వేడి పెంచుతోంది. ప‌నిలో ప‌నిగా సోద‌రి ఐషా శ‌ర్మ‌ను క‌థానాయిక‌గా ప్ర‌మోట్ చేస్తోంది.

ఐషా ఇటీవ‌లే జాన్ అబ్ర‌హాం స‌త్య‌మేవ జ‌య‌తే చిత్రంలో న‌టించి ఆక‌ట్టుకుంది. వాస్త‌వానికి ఇండ‌స్ట్రీ 100కోట్ల క్ల‌బ్ సినిమా జుడ్వా 2లో ఐషా క‌థానాయిక‌గా న‌టించాల్సింది. కానీ చివ‌రి నిమిషంలో ఆ ఆఫ‌ర్ మిస్స‌య్యింది. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కునికి సోద‌రిలా ఇండ‌స్ట్రీ లో బెస్ట్ అవ‌కాశాన్ని అందుకోవాల‌ని క‌ల‌లు గంటోంది.

  •  
  •  
  •  
  •  

Comments