నేల టిక్కెట్టు కనీసం ఆ కలెక్షన్స్ ని కూడా టచ్ చేయలేదు!

Saturday, June 2nd, 2018, 02:49:16 PM IST

గతంలో వరుస పరాజయాలతో సతమతమవుతోన్న మాస్ రాజా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి హిట్ అయ్యింది. కానీ రవితేజ మళ్లీ రొటీన్ కథలనే చేస్తున్నాడు అనే తరహాలో టాక్ తెచ్చుకుంటున్నాడు. గత ఏడాదితో రికవర్ అయ్యాడు అనుకున్నప్పటికీ వెంటనే టచ్ చేసి చూడు వచ్చి భారీ దెబ్బ కొట్టింది. ఇక అదే తరహాలో రీసెంట్ గా వచ్చిన నేల టిక్కేట్టు కూడా ఏ మాత్రం లాభాలను అందించలేదు.

రవితేజకు మంచి మార్కెట్ ఉన్న నైజంలో నేల టికెట్టు మొదటి వారం షేర్స్ 2.78కోట్లు. 8వ రోజు 2 లక్షలు రాగా మొత్తంగా 8 రోజుల నైజం షేర్స్ 2 కోట్ల 80 లక్షలు. వరుసగా సోగ్గాడే చిన్ని నాయన – రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ క్రేజ్ ఏ మాత్రం కనిపించలేదు. ఇంతకుముందు రవితేజ నటించిన టచ్ చేసి చూడు నైజాంలో మొదటి వారం 3.10 కోట్ల షేర్స్ వచ్చాయి. ఇప్పుడు అంతకంటే తక్కువగా రావడం చూస్తుంటే రవితేజ మార్కెట్ నైజాంలో ఎంతగా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేసినా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అపజయాన్ని అందుకుంది.