`నేల టిక్కెట్టు` వీడియో సాంగ్ ప్రోమో

Sunday, May 13th, 2018, 12:10:14 PM IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `నేల టిక్కెట్టు` ఆడియో ఇటీవ‌లే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతుల‌మీదుగా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. `అంత సిగ్గు లేకుండా ఎలా న‌టిస్తారు?` అంటూ ప‌వ‌ర్‌స్టార్ స్వ‌యంగా మాస్‌రాజాని అడిగేసిన వైనంపై ర‌వితేజ స్వ‌యంగా ఆడియో లైవ్‌లో చెప్పుకుని ఎంతో ఆనంద‌ప‌డిపోయారు. త‌న లైఫ్‌లో బెస్ట్ కాంప్లిమెంట్ అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. వేదిక‌పై లాంచ్ చేసిన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.

తాజాగా `నేల టిక్కెట్టు` వీడియో ప్రోమోల్ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది యూనిట్‌. ఇందులో ర‌వితేజ‌- మాళ‌విక శ‌ర్మ డ్యూయెట్ స‌హా మ‌రో మూడు పాట‌ల్ని ఆవిష్క‌రించారు. నేల టిక్కెట్టు పాట‌లు ప్రామిస్సింగ్ అని చెప్పేందుకు ఇదిగో ఈ వీడియో ప్రోమోలు చెబుతున్నాయి. ముఖ్యంగా మాస్‌రాజాతో పోటీప‌డుతూ కొత్త‌మ్మాయ్ మాళ‌విక ఎంతో గ్రేస్ చూపించ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఇక `నేల టిక్కెట్టు` పాట‌ల జ్యూక్ బాక్స్‌ని ట్విట్ట‌ర్‌లో రిలీజ్ చేశారు. శ‌క్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.