`నేనే రాజు నేనే మంత్రి` సీక్వెల్ ప్లాన్‌

Tuesday, September 4th, 2018, 10:36:38 PM IST

రానా – తేజ రేర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `నేనే రాజు నేనే మంత్రి` సీక్వెల్ గురించి చాలాకాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సీక్వెల్‌కి తేజ క‌థ రాస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే రానా- తేజ – సురేష్‌బాబు బృందం ఈ సీక్వెల్‌పై సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారా? అంటే దానిపై ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. రాజ‌కీయాల్లో లేటెస్ట్ ట్రెండ్‌పై తీసిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో తేజ తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చి వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. వెంకీతో సినిమా ప‌నుల్లో తేజ బిజీగా ఉన్నారు.

సీక్వెల్‌పై `నేనే రాజు నేనే మంత్రి` నిర్మాణ భాగ‌స్వామి అయిన‌ పీపుల్స్ మీడియా అధినేత‌లు భ‌ర‌త్, కిర‌ణ్‌ని ప్ర‌శ్నిస్తే .. దానిపై స్ప‌ష్ట‌తనిచ్చారు. నేడు బ్లూప్లానెట్ ఆఫీస్‌లో జ‌రిగిన‌ ఇంట‌ర్వ్యూలో ఆ ఇద్ద‌రూ మాట్లాడుతూ .. ఈ సినిమాకి సీక్వెల్ చేయాల‌న్న ఆస‌క్తి ఉంది. అయితే దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌లేదు. తేజ‌, సురేష్‌బాబు సిద్ధంగా ఉంటే చేసేందుకు సిద్ధ‌మేనని తెలిపారు. దీనిని బ‌ట్టి సీక్వెల్ ఉంద‌ని కానీ, లేద‌ని కానీ చెప్ప‌లేం. సీక్వెల్ తీసేందుకు ఆస్కారం ఎక్కువేన‌ని అర్థ‌మ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments