నాని .. మాస్ పల్స్ బాగానే పట్టేసాడయ్యో ?

Tuesday, February 14th, 2017, 11:23:33 AM IST


అచ్చంగా మన ఇంటి కుర్రాడిగా ఇమేజ్ తెచ్చుకున్న నాని మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నం ఫలించింది, ఫలించడమే కాదు ఏకంగా కెరీర్ బెస్ట్ వసూళ్లను అందుకుని మాస్ ఇమేజ్ లో నానికి తిరుగులేదని నిరూపించింది ? నాని లేటెస్ట్ గా నేను లోకల్ సినిమా కేవలం వారంలోనే 20 కోట్ల షేర్ రాబట్టి దుమ్ము రేపింది. నిజంగా ఈ సినిమా నాని కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు రాబట్టి నాని మార్కెట్ ను అమాంతం పనిచేసింది. దిల్ రాజు బ్యానర్ లో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. మరో వైపు అమెరికా లోకూడా 1 మిలియన్ మార్క్ ని దాటేసింది. ఇప్పటికే దాదాపు 30 కోట్ల వసూళ్లను అందుకోనున్న ఈ సినిమా వీకెండ్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం !! నేను లోకల్ పది రోజుల వసూళ్లు
నైజాం – 8. 42 కోట్లు,
సీడెడ్ – 2. 64 కోట్లు,
ఉత్తరాంధ్రా – 3. 02 కోట్లు,
గుంటూరు – 1. 56 కోట్లు,
కృష్ణా – 1. 58 కోట్లు,
ఈస్ట్ – 1. 89 కోట్లు,
వెస్ట్ – 1. 18 కోట్లు,
నెల్లూరు – 0. 61 కోట్లు,
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20 . 09 కోట్లు,
అమెరికా – 2. 88 కోట్లు, కర్ణాటక – 1. 77 కోట్లు, ,మిగతా ఏరియాల్లో కలిపి – 0. 95 కోట్లు, ,మొత్తంగా – 26. 05 కోట్లు,