ఆ ఒక్క ఛానెల్ మినహా భారత్ న్యూస్ ఛానెల్స్ ప్రసారాలను నిలిపేసిన నేపాల్!

Friday, July 10th, 2020, 02:06:55 AM IST


నేపాల్ దేశం ఇటీవల కాలంలో భారత్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా మరొకసారి నేపాల్ తన అక్కసును వెళ్లగక్కారు. భారత్ లో అతి ప్రధానమైన ఒక్క దూరదర్శన్ మినహా మిగతా అన్ని న్యూస్ ఛానెల్స్ ప్రసారాలను నిలిపి వేయడం జరిగింది. అయితే నేపాల్ కి వ్యతిరేకంగా తప్పుడు ప్రసారాలు జరుగుతున్నాయి అని సంచలన ఆరోపణలు చేస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం తో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని పై అక్కడి ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అయితే ఇప్పటికే భారత్ లో కయ్యానికి కాలు దువ్విన చైనా, పాకిస్తాన్ మరియు నేపాల్ సహకారాలతో భారత్ ను దెబ్బతీయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి దీని పై ఆ దేశ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, భారత్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.